- సి ఐ టి యు జిల్లా కమిటీ పిలుపు
నవతెలంగాణ-కంటేశ్వర్
మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5న చలో పార్లమెంటును జయప్రదం చేయాలి అని సిఐటియు జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు శనివారం సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. మోడీ తెచ్చిన లేబర్ కోడులకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న కార్మిక, కర్షక ఐక్య వేదికఆధ్వర్యంలో చలో పార్లమెంటు కు లక్షలాదిమంది కార్మికులు తరలి రావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు.
మోడీ ప్రభుత్వము హిందుత్వ వాదం తో కార్మికుల మద్య కులం మతం చిచ్చు లేపి కార్మికుల మధ్య చీలికలు తెచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏప్రిల్ 5న పార్లమంటు ముట్టడితో మోదీ ప్రభుత్వము మునిగి పోతుందని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది స్కీమ్ వర్కర్లు సమాజ సంక్షేమం కోరకు పని చేస్తున్నారని వారికీ కనీస వేతనాలు అమలు చేయకుండా వెట్టి చాకిరి చేయించుకుంటూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని వారికి కనీస వేతనాలు 26వేలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఈవిల్ నారాయణ చక్రపాణి కోశాధికారి పి.స్వర్ణ సహాయ కార్యదర్శి, గోవర్ధన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 03:48PM