నవతెలంగాణ-డిచ్ పల్లి
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని సరియైన విటమిన్లు ప్రోటీన్లు గల ఆహారాన్ని తీసుకోవాలని ప్రతి ఒక్కరూ శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది పరిపూర్ణమైన ఆరోగ్యంగా పరిగనించ చబడుతుందని వై శంకర్ అన్నారు. శనివారం డిచ్ పల్లిలో వెనుకబడిన తరగతుల కళాశాల వసతి గృహం లో ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరం, అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు తమ అరోగ్య యాక్షన్ చుసుకుంటు అవసరాల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని, సరియైన విటమిన్లు, ప్రోటీన్లు గల ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది పరిపూర్ణమైన ఆరోగ్యంగా పరిగనించ చబడుతుందని తెలిపారు. సాధారణ వ్యాధులకు మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ రాధిక, ఆరోగ్య కార్యకర్త శైలజ ఆశా కార్యకర్తలు అరుణ, లక్ష్మీ, వనిత, సరిత విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 04:04PM