- మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు
- చదరగొట్టి కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో మంత్రి కాన్వాయ్న కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్(కార్పొరేటర్), తోపాటు కొంతమంది ఎన్ఎస్యూఐ నాయకులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కలెక్టరేట్కు హెలికాప్టర్ ద్వారా వచ్చిన మంత్రి కేటీఆర్ హెలిప్యాడ్ నుంచి భూమారెడ్డి కన్వెన్షన్లో కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతులతో ఇంటరాక్షన్కు కేటీఆర్ వెళ్తుండగా హఠాత్తుగా కాన్వాయ్క కాంగ్రెస్ నాయకులు నల్ల జెండాలతో ఎదురుగా వచ్చారు.
ఎదురుగా వచ్చి కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల రక్షణ వలయాన్ని చేధించి కాన్వాయ్కి అడ్డు రావడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అక్కడికక్కడే వారిని ఆరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రి కేటీఆర్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేసినా కాంగ్రెస్ నాయకులు మంత్రి కేటీఆర్ కాన్వాయ్న అడ్డుకోవడం కలకలం రేపింది. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ గత ఏడాది సీఎం కేసీఆర్ సెప్టెంబర్ ఐదున నిజామాబాద్ పర్యటనను అడ్డుకొని కలకలం రేపారు.
ఆ సమయంలో అధికారులను బాధ్యులను చేస్తూ సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు పోలీసులు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. మంత్రి కేటీఆర్ వస్తున్నా నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రినే అడ్డుకున్న గడువు రోహిత్ ను ముందస్తుగా ఎందుకు అరెస్టు చేయలేదని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వైఫల్యం కారణమని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 04:32PM