- ఎస్ ఎఫ్ ఐ
నవతెలంగాణ-కంటేశ్వర్
అక్రమ అరెస్టులు చేయడమంటే కేటీఆర్ విద్యార్థులకు భయపడడమే అని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా నీ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని కేటీఆర్ ని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లాల్లో ఇంజనీరింగ్ కళాశాలనూ ఏర్పాటు చేయాలని అన్నారు.
అదే విధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలను 3000 వేలకు పెంచాలని పెండింగ్ లో ఉన్న ఫీ రియింబర్స్మెంట్లను విడుదల చేయకపోవడంతో చదువులు ఎలా ముందుకు సాగుతాయని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా మన ఊరు మనబడి పథకం కింద అన్ని పాఠశాలలను అభివృద్ధి పరిచి ఆంగ్ల విద్యా బోధనను అనుసరించాలని అన్నారు. విద్యారంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 04:40PM