నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామంలో నిర్వహిస్తున్న నచ్చరాజు వెంకటకిషన్ రావు వర్ధంతి వేడుకలకు శనివారం బీజేపీ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డి, రాష్ట్రాధికార ప్రతానిధి రాణి రుద్రమ, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ దరువు ఎల్లన్న హజరై రాష్ట్రాధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ తో కలిసి వెంకటకిషన్ రావు చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు పుర్మ సత్యనారాయణ రెడ్డి గృహన్ని బీజేపీ నాయకులు సందర్శించి మండల బీజేపీ శ్రేణులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రెడ్డి, రాణి రుద్రమ,దరువు ఎల్లన్నను మండల బీజేపీ నాయకులు శాలువా కప్పి ఆత్మీయ సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm