నవతెలంగాణ - అశ్వారావుపేట
సేంద్రియ ఎరువులు ఉపయోగించి సాగు చేయడం ద్వారా నేల పునరుజ్జీవం పొందుతుందని యు.ఎల్.ఎ మేనేజింగ్ డైరెక్టర్ చక్రపాణి అన్నారు. యుఎల్ఎ, మునార్ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంయుక్త ఆద్వర్యంలో శనివారం స్థానిక గిరిజన్ భవన్ లో ఆయిల్ ఫాం సాగు దారులకు పామ్ ఆయిల్ సాగులో సేంద్రీయ విధానం అనే అంశం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎచ్ఎ అనేది నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలకు ప్రమాఖ్య సూచి అని ఇది సూక్ష్మజీవ మయోమాస్ కి అనుగుణ నిష్పత్తిలో ఉంటుందని అన్నారు. నేల సేంద్రియ పదార్థం యొక్క జీవ ఆక్సీకరణ లో డిఎచ్ఎ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని తెలిపారు. అనరోబిక్ సూక్ష్మజీవులు అధిక డిహెచ్ఎ ని నేలలో ఉత్పత్తి చేస్తాయి అని తెలిపారు
నేల గాఢత, సేంద్రియ పదార్ధం, మృత్తిక తేమ, ఆమ్లజని లభ్యత, ఉష్ణోగ్రత వంటివి నేల జీవ స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి వివరించారు.
భార లోహ కాలుష్యం, రసాయన ఎరువులు, కీటకనాశనులు చీడ నాశని, పంటల్లో వచ్చే వ్యాధులు,చీడ మరియు కలుపు నియంత్రణకు డిహెచ్ఎ ప్రభావానికిలోను అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుఎల్ఎ డైరెక్టర్ అబ్రహాం, మునార్ ఎ.జి.ఎం రమణ మూర్తి, టి ఎస్ జోనల్ మేనేజర్ శంకర్, సీనియర్ మేనేజర్ జి.నవీన్, టి.ఎస్ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్లోవర్స్ సొసైటీ బాధ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,తుమ్మ రాంబాబు, ఆళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 07:59PM