- అల్లం రాజకుమార్ తాహసిల్దార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రస్తుతం ప్రతి రెవిన్యూ గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా ఆయా ప్రాంతా రైతుల భూ సమస్యల పరిష్కారం జరుగుతుందని తహసిల్దార్ అల్లం రాజకుమార్ అన్నారు. శనివారం మండలంలోని మొట్లగూడెం పంచాయతీ ప్రాజెక్టు నగర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అపరిస్కృత భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కటి వేదిక అనే దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులు రెవెన్యూ కార్యాలయానికి దానవసరం లేకుండా ప్రభుత్వం రైతుల అవసరాలకు అనుగుణంగా వారి గ్రామంలోనే రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తూ భూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. ప్రతినిత్యం వ్యవసాయ పనులు తదితర పనులలో బిజీబిజీగా ఉంటున్న రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు
ప్రస్తుతం మండల వ్యాప్తంగా ముబారంగ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు ఇప్పటికే కొన్ని గ్రామపంచాయతీ రెవెన్యూ గ్రామాలను సదస్సులను పూర్తి చేయగా మరికొన్ని గ్రామాలలో త్వరలోనే పూర్తి చేస్తామని రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం సిద్ధంగా ఉండాలని సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాజేందర్ రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:00PM