నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి అశోక్ చౌహాన్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా - వోస్ (మౌఖిక పరీక్ష) శనివారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహించారు. ఈ వైవా లో ఆర్ట్స్
డీన్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య, పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్ డాక్టర్ యండి. జమీల్ అహ్మద్, డాక్టర్ నారాయణ, అసోసియేటెడ్ ప్రోఫేసర్, శ్రీవేంటేశ్వర యూనివర్సిటీ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గాను, డాక్టర్ వి. పార్వతి, విభాగ అధిపతి జి. ప్రవీణ బాయీ, కన్వీనర్ గా హాజరయ్యారు.
డాక్టర్ జి. ప్రవీణ బాయ్ పర్యవేక్షణలో " హిందీ కే ఆదివాసీ ఉపన్యాసొన్ మే చిత్రిత్ జీవన్ సంగర్ష్" అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి సమర్పించారు. ఈ వైవా - వోస్ కు ఎక్స టర్నల్ ఎగ్జామినర్ గా యస్. వి. యూనివర్సిటీ నుంచివచ్చిన డా,, నారాయణ సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి పరిశోధకుడి నుంచి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మౌఖిక పరీక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ హాజరై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ విద్యవర్థిని, డాక్టర్ నారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ , యస్.వి. విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను అందజేశారు. ఈ వైవలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరతి, డాక్టర్ ముస ఖురేషి, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, నాగరాజ్ , డాక్టర్ తహేర్, పరిశోధకులు సంజయ్ చౌహాన్, తక్షశిల, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:02PM