- సురపనేని సాయికుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఫ్రూట్ ఫారం సమ్మక్క సారమ్మ జాతర చరిత్ర రాష్ట్ర నలుమూలలకుతెలియాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సురపనేని సాయికుమార్ అన్నారు. శనివారం మండలంలోని చలువాయి పంచాయతీ ఫ్రూట్ ఫారం గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారమ్మ జాతరను టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ బృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ చల్వాయి సర్పంచ్ మరియు ఆలయ ప్రధాన పూజారి అయిన వీసం సమ్మయ్య తన బాల్యం నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో నిష్ట నియమాలతో జాతరను నిర్వహిస్తున్నారని అన్నారు. రకరకాల వ్యాధులు బారిన పడిన వాళ్లకు మరియు పిల్లలు లేని వారికి రకరకాల రుగ్మతలతో బాద పడే వారికి ఇన్ని సంవత్సరాలుగా లక్షలాదిమందికి తన భక్తితో మూలిక శక్తితో బాగు చేయడం జరిగిందన్నారు.
నేడు తెలంగాణ నుండే కాకుండా హైదరాబాద్ పట్టణం నుండి మొదలుకొన ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. ఈ జాతర ప్రస్తావ్యాన్ని ప్రచారం చేయడంలో ముందుండాలని దానివల్ల గ్రామానికి మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆలయ ప్రధాన పూజారి అయిన సమ్మయ్య ముందు ముందు ఎంతో అభివృద్ధిని సాధించి జాతరను మరింత ఘనంగా నిర్వహించాలని రాజకీయంగా కూడా ఎదగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్ సర్పంచ్ లావుడియా లక్ష్మి జోగనాయక్ మీడియా ఇన్ఛార్జి ఉట్ల పృథ్విరాజ్ అజ్మీర సురేష్ జన్ను సుధాకర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:03PM