- సారలమ్మ గుడి నీ ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై ఎస్సీ.ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
- తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్
- ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడించి రాస్తారోకో నిర్వహణ చేసిన తుడుందెబ్బ
- పోలీస్ శాఖ జోక్యంతో శాంతించిన ఆదివాసులు
నవతెలంగాణ -తాడ్వాయి
మండలం కేంద్రం లోని ఆదివాసీలు తర తరాలుగా కొలుస్తున్న సారలమ్మ దేవర గుడి నీ శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు ధ్వంసం విషయం విధితమే. శనివారం ఈ సంఘటనపై బగ్గు మన్న ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసి ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆది ఆదివాసీలకు మద్దతుగా బారి ర్యాలీ నిర్వహించారు. అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్య క్రమం చేసి, రాస్తారోకో చేశారు.
ఈ ధర్నా కార్యక్రమం లో ఆదివాసి ఉద్యమ నేత, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, మేడారం పుజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంకిడి బుచ్చయ్య, పునరుద్ధరణ కమిటీ మాజీ చైర్మన్ కోర్నిబెళ్ళి శివయ్య, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి కొర్ని బెల్లీ గణేష్, ఉపాధ్యక్షులు అరెం లచులటేల్, జి సి సి డైరెక్టర్ పులుసం పురు షోతం, బీజేపీ మండల అధ్యక్షులు మల్లెల రాంబాబు లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం లో ప్రతీ మతాన్ని గౌరవిస్తూ గుళ్ళు, మసీదులు, చర్చి లు మతాలకు అతీతంగా గౌరవించాలని, దానికి భంగం కలిగించిన అధికారులపై చట్ట రీత్యా నేరస్తులుగా పరిగణించాలని ఉన్న క్రమం లో ఆదివాసీల దేవాలయం అయిన సారలమ్మ గుడి నీ ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులైన ఎఫ్ బి ఓ, ఎఫ్ ఎస్ ఓ, రేంజర్ ల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమేదు చేయాలని అన్నారు.
ఆది ఆదివాసీల ఆత్మగౌరవ న్ని కించ పరిచే ఈ అధికారుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం 5 వ షెడ్యుల్ భూభాగం లోని పీసా చట్టం అమలులో ఉన్న ప్రాంతం అని ఇక్కడ ప్రభుత్వ శాఖలు అన్ని పీసా గ్రామ సభ లకు అనుగుణంగా పని చేయాలన్నారు. అలాంటిది మా చట్ట వ్యతిరేక కార్య క్రమాలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయకుంటే దాడులకు, ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. మా దేవుళ్ళను, మా ఆదివాసి జాతి ఆత్మగౌరవ సమస్య కి నిదర్శనం అని అందుకే మా పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీంతో తాడ్వాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పస్రా- ఏటూర్ నాగారం163వ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి. పస్రా సిఐ వంగ శ్రీనివాస్, స్థానిక ఎస్సై చవళ్ళ వెంకటేశ్వరరావు లు వచ్చి శాంతి యుత మార్గం లో సమస్య కి పరిష్కారం చూపిస్తాం అని హామీ ఇచ్చారు. దీంతో ఆదివాసీలు ధర్నా ను విరవింపజేశారు.
డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్ రావు, కామారం సర్పంచ్ రేగ కళ్యాణి, తుండుందెబ్బ ఉపాధ్యక్షులు కొప్పుల జగన్, పులుసే బాలకృష్ణ, సిద్ధబోయిన వసంతరావు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బొల్లు దేవేందర్, తుడుందెబ్బ నాయకులు బంగారు శ్రీకాంత్, బిర్సా ముండా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, కొర్నబెల్లి వీరేశం, తాటి రామ్ చందర్, రమేష్, ఊకే రామయ్య, మోకాళ్ల వెంకటేష్, తుడుందెబ్బ మహిళా విభాగం ఆదివాసి మహిళ నాయకులు తాటి లక్ష్మి, వజ్జ పద్మ, స్వర్ణపాక సమ్మక్క, ఇరుప సుకన్య, బంగారి లక్ష్మీనరసమ్మ, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:08PM