- మంత్రి కాన్వాయ్ నీ అడ్డుకున్న బిజెపి కార్పొరేటర్ తో పాటు బీజేవైఎం నాయకులు
- బీజేవైఎం నాయకులపై లాఠీ లు జూళిపించిన పోలీసులు
- అడ్డుకున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర పురపాలక ఐటి మంత్రి కేటీఆర్ కూ నిరసనల సెగ తగిలింది. ఈ మేరకు శనివారం మంత్రి కేటీఆర్ ఉదయం 3 కార్యక్రమాలు పూర్తి చేసుకొని నాలుగో ప్రోగ్రాం విశ్వం డయాగ్నస్టిక్స్ ప్రారంభోత్సవం అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్ద బిజెపి కార్పొరేటర్ ఎర్రం సుధీర్ బీజేవైఎం నాయకులు ఆకాష్ లతోపాటు మరికొందరు ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో అగ్రహించిన పోలీసులు బీజేవైఎం నాయకులపై లాఠీ లు జూళి పించారు. చితకబాలి డిచ్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.పోలీసుల రక్షణ వలయాన్ని చేదించి కాన్వాయ్ కి అడ్డు రావడంతో పోలీసులు షాక్ కూ గురయ్యారు. అక్కడికక్కడే వారినీ ఆరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మంత్రి కేటీఆర్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిపక్షాల నాయకులను ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులు మంత్రి కేటీఆర్ కాన్వాయిని అడ్డుకోవడం కలకలం రేపింది. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ గత ఏడాది సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకోవడం కలకలం రేపారు. ఆ సమయంలో అధికారులను బాధ్యులను చేస్తూ సిఐ,ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఈసారి మంత్రి కేటీఆర్ కు సైతం నిరసనల సెగ తగలడంతో సంబంధిత పోలీసులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. స్థానికంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల వైఫల్యం వల్లే ఎన్ఎస్ యూ ఐ, బీజేవైఎం నాయకులు అడ్డుకోవడం పట్ల పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించారు. దీంతో సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:10PM