- పోలీసుల అధీనంలో నిజామాబాద్ నగరం
- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు
- డాక్స్ఫర్డ్ బాంబ్స్వర్డ్ తో తనిఖీలు
- బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ నాగరాజు
నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు డేగ కన్నుల నిజామాబాద్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ భారీ బందోబస్తును పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో వచ్చిన ఆయన నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చేరుకున్నారు. ఆలోపే నిజాంబాద్ నగరంలో పోలీసులను పెద్ద సంఖ్యలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పోలీసులను పోలీస్ కమిషనర్ నాగరాజు ఎప్పటికప్పుడు అలాట్ చేస్తూ బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ స్వయంగా ప్రతి ప్రాంతానికి వెళ్లి మరి పర్యవేక్షించారు.
నిజామాబాద్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించే ప్రాంతాలు అన్నిటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించారు. మంత్రి కేటీఆర్ సుమారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు గంటల వరకు తన కార్యక్రమాలను పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పుడు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు బందోబస్తు లో స్వయంగా సిపి నాగరాజు తో పాటు డీసీపీ అరవింద బాబు, నిజామాబాద్ ఏఆర్డిసిపి గిరిరాజ్, ట్రాఫిక్ ఏసిపి నారాయణ, నిజామాబాద్ ఏసీపి వెంకటేశ్వర్, ఆర్మూర్ ఎసిపి ప్రభాకర్, బోధన్ ఎసిపి కిరణ్ కుమార్, సిసిఎస్ ఏసిపి రమేష్, టాస్క్ ఫోర్స్ ఏసిపి కిరణ్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మధుసూదన్, సిఐలు ఎస్ఐలు కానిస్టేబుళ్లు మహిళా కానిస్టేబుళ్లు హోంగార్డులు సుమారు 800 మంది వరకు బందోబస్తులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:12PM