నవతెలంగాణ-ఇల్లంతకుంట
మండలములోని చింతలకుంటపల్లె గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన తమ సమీప బంధువు తన్నీరు జలంధర్ రావు తల్లి లక్మీభాయి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం పరామర్శించారు. తమ సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మానకొండూర్, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే లు రసమయి బాలకిషన్, సంజీవరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి వి రామ కృష్ణ, తోట ఆగయ్య, జడ్పీ వైస్ చైర్మన్ వేణు, ఎంపిపి ఊట్కూర్ రమణారెడ్డి నాయకులు అనిల్, నర్సయ్య యాదవ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు .