నవతెలంగాణ-ఇల్లంతకుంట
మండల కేంద్రములో ఉన్న రక్షక భట నిలయాన్ని డిఐజి రమేష్ నాయుడు, ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. మండలములోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలతో మమేమమై సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. శాంతి భద్రతలు కాపాడాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సిఐ ఉపేందర్, ఎసై మామిడి మహేందర్ సిబ్బంది ఉన్నారు .
Mon Jan 19, 2015 06:51 pm