- జీరో సర్వీస్ బదిలీలకు అనుమతి ఇవ్వాలి
- ఎస్ఓటీ, ఎల్పీ స్పౌజ్ బదిలీలు చేయాలి
- ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి), స్టీరింగ్ కమిటీ, నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో - జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు
నవతెలంగాణ-కంటేశ్వర్
రాష్ట్ర సంఘ జరుగుతున్న ఉపాధ్యాయుల పైరవీరులు బదిలీలు ఆపాలని జీరో సర్వీస్ బదిలీలకు అనుమతి ఇవ్వాలని ఎస్ జి టి ఎల్ పి హౌస్ బదిలీలను చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునివ్వడంతో నిజామాబాద్ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ సభ్యులు టీఎస్ యుటిఎఫ్ సత్యానంద్ టి పి టి ఎఫ్ సత్యనారాయణ డి టి ఎఫ్ రాజన్న ఎస్సీ ఎస్టీ యూఎస్ సుధాం టి ఎస్ పి టి ఏ వెంకటరమణలు మాట్లాడుతూ.. రాజకీయ పలుకుబడితో చేస్తున్న వందలాది పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలని, బదిలీల్లో కనీస సర్వీసు నిబంధనను తొలగించాలని, మిగిలిన ఎస్జీటీ, ఎల్పీ స్పౌజ్ బదిలీలను నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేదు.
ఏ విధమైన అక్రమాలకు తావులేకుండా బదిలీలు పారదర్శకంగా జరపాలని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సూచించిన ప్రభుత్వమే పైరవీ బదిలీలకు తెరలేపడం ఉపాధ్యాయుల్లో అశాంతికి కారణమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చిన విధంగా పైరవీ బదిలీలు నిలివేసి, ఉపాధ్యాయులు అందరికీ బదిలీల్లో పాల్గొనే అవకాశం ఇచ్చి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యుయస్పీసి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహణలో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సాయంత్రం సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించాము అని తెలియజేశారు. ఈ సందర్భంగా తక్షణమే పైరవీ బదిలీలను ఆపాలని, జీరో సర్వీస్ బదిలీలకు అనుమతినివ్వాలని, ఎస్జీటీ, ఎల్పీల స్పౌస్ బదిలీలు చేయాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:18PM