నవతెలంగాణ-ఏర్గట్ల
మండలంలోని బట్టాపూర్ శివారు నందు 28 ట్రిప్పుల ఇసుక డంప్ లను సీజ్ చేసినట్లు ఏర్గట్ల ఎమ్మార్వో జనార్దన్ తెలిపారు.పట్టుకున్న ఇసుకను డబుల్ బెడ్ రూమ్ పనులకు తరలించినట్లు ఆయన తెలిపారు. గత రెండు రోజుల క్రితం 45 ట్రిప్పుల ఇసుక డంప్ లను సీజ్ చేయగా.. శనివారం తాజాగా 28 ట్రిప్పుల ఇసుక సీజ్ చేశారు. తమ అనుమతి లేనిదే ఇసుక తరలిస్తే కేసులు నమోదుచేస్తామని ఎమ్మార్వో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm