నవతెలంగాణ-గోవిందరావుపేట
కేబుల్ లైన్ పేరుతో తవ్వకాలు. తవ్వేది తక్కువ తొక్కేది ఎక్కువ. కమ్యూనికేషన్ కేబుల్ వేస్తున్నామంటూ కొందరు గుత్తేదారులు ఇష్టారాజ్యంగా అడవుల్లో తవ్వకాలు చేపడుతున్నారు. జెసిబిల సహాయంతో ప్రోక్లైన్లతో లైన్ తీస్తూ ఉన్న క్రమంలో లైను కొద్దిగా అయినప్పటికీ ప్రోక్లైన్ జెసిబి లు అటు ఇటు తిరుగుతున్న క్రమంలో చిన్నచిన్న చెట్లు చిన్నచిన్న జీవాలు అంతరించిపోతున్నాయి. ఈ ప్రక్రియతో నష్టం అధికంగా వాటిల్లుతోంది గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్టు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ఈ విషయమై సంబంధిత అటవీ అధికారులను మీడియా ప్రశ్నించగా అనుమతులను పరిశీలిస్తామని అంటున్నారే తప్ప అనుమతి ఉంది లేనిది ఇప్పటివరకు చెప్పకపోవడం దురదృష్టకరం. ఈ తవ్వకాలు నిరంతరం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. చెట్లకు జీవాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేబుల్ లైన్ వేసుకోవాలి కానీ జెసిబిలు ప్రోక్లైన్లతో ఇష్టారాజ్యంగా అటు ఇటు తిప్పుతూ మరింత నష్టాన్ని కలగజేస్తున్నారు. జెసిబి లు ప్రోక్లైన్లో తిరుగుడు వల్ల మొక్కలు విరిగిపోతూ నేల వాలిపోతున్నాను జెసిబి లు ప్రోక్లైన్లు ప్రయాణిస్తున్న మార్గంలో అనేక అటవీ సరిశ్రుపాలు జాతులు అంతరించిపోతున్నాయి. సంబంధిత అటవీ అధికారులకు సంబంధం లేదా ఉన్న పట్టించుకునే వారే లేరు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన కరువైంద అని స్థానికులు అంటున్నారు.
సంబంధిత కేబుల్ గుత్తేదారు మీడియా అడిగినా కూడా అనుమతి పత్రాలు చూపించకుండా దాటవేస్తూ కాలయాపన చేస్తూ అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అనుమతులను పరిశీలించి ప్రోక్లైన్లు జెసిబి లు వాడకుండా మనుషుల ద్వారా కేబుల్ లైన్ వేసుకున్నట్లయితే అడవులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కింది నుంచి మీది వరకు అంత మామూళ్ల మయమే అన్నట్టుగా గుత్తేదారు వ్యవహరిస్తున్నాడు. గుత్తేదారుల ఓంటెద్దు పోకడలకు కెమెరా గీతం పాడాలని నిజాయితీపరులైన అధికారులు విధులకు రావాలని అడవులకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:20PM