- ఎప్పటి నుండో తరలివస్తున్న భక్తులు
నవతెలంగాణ -తాడ్వాయి
మినీ మేడారం జాతరకు గత నెలరోజుల నుండి భక్తులు తండోప తండాలుగా కదిలి వస్తున్నారు. మినీ జాతర (మండిమెలిగే పండుగ) వచ్చే నెల ఫిబ్రవరి 1 నుండి 4వ తారీఖు వరకు నాలుగు రోజులు పండగ ఘనంగా నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జాతరకు ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవనులకు చీర ఇచ్చి పసుపు కుంకుమలు పెట్టి భక్తులు అమ్మవార్లకు పెద్ద ఎత్తున బంగారం సమర్పించుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం మేడారం మహా జాతరకు అధికారులు ఊరటం మేడారం 'కాజువే' ను లక్షల రూపాయలు వెచ్చించి తాత్కాలిక మరదలు మరమ్మతులు చేపడుతుంటారు. వేసిన రెండు నెలలకే వర్షాలకు కొట్టుకొని పోతుంది. ఈసారి మినీ జాతరకు కొండాయి నుండి పగిడిద్దరాజు ఆ వైపు నుండి వచ్చే భక్తులకు నాన్న ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు 'కాజ్వే' ను అలానే వదిలేశారు. భక్తులు నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.
పూర్తయిన పనులు
ఎన్పీడీసీఎల్, ఎండోమెంట్, టాయిలెట్స్, పారిశుద్ధ్యం సిబ్బంది, బావుల్లో కూడికతీత పనులు సంబంధిత శాఖ అధికారులు మేడారంలోనే ఉంటూ సుమారు పనులు పూర్తి చేశారు. రాత్రింబగలు అనుకుంటా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు పూర్తి చేశారు.
అర్థగంటకు ఒక బస్సు- ఆర్టీసీ
మినీ మేడారం జాతరకు భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి అణువుగా ఉండటానికి ప్రతి 45 నిమిషములకు ఓసారి ఆర్టీసీ బస్సును ప్రవేశపెట్టారు. ఆర్టీసీ ఆర్ఎం, డిఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో బస్సులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం టి ఎస్ ఆర్ టి సి నేటి నుండి తారీకు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హనుమకొండ నుండి మేడారంకు పెద్దలకు 160 రూపాయలు, 90 రూపాయలు చార్జీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అనుకూలంగా బస్సులు నడపడం జరుగుతుందని తెలిపారు.
మేడారం మినీ జాతర పారిశుద్ధ్య పనులకు 300 మంది కార్మికులు
సమ్మక్క సారలమ్మ వనదేవతల మినీ మేడారం జాతరకు భక్తులకు దుర్వాసన వెదజల్లకుండా సౌకర్యార్థం 300 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహించనున్నట్లు డిపిఓ వెంకయ్య తెలిపారు. జాతర ముందు, జాతరలో, జాతర అనంతరం కార్మికులు షిఫ్ట్ వైజ్ గా పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎక్కడ పారిశుద్ధం లేకుండా చెత్తాచెదారాన్ని డంపింగ్ పంపించినట్లు తెలిపారు.
భక్తులు క్యూ లైన్ ల ద్వారా దర్శనాలు
మేడారం మినీ జాతర ముందు నుండే ముందస్తు భక్తులు సందర్శించుకోవడం జరుగుతుంది. అందు కోసం ఎండోమెంట్ అధికారులు క్యూలైన్లను మరమ్మతి చేపట్టారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్ల ద్వారా దర్శనాలను నిర్వహిస్తున్నారు. క్యూలైన్ల వద్ద త్రాగునీటి సౌకర్యం, ఎండ తగలకుండా మంచెలను ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రాజేంద్రం దగ్గర ఉండి పనులన్నీ నిర్వహిస్తున్నారు. భక్తులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని అందరూ వచ్చి వనదేవతల దర్శనం చేసుకుని వెళ్లాలని తెలిపారు.
పూజారుల సంఘం
మేడారం మినీ జాతరలో మేడారం సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారుల పాత్ర కీలకం. పూజారులు వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, వివిధ శాఖ అధికారుల సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. మినీ జాతర విజయవంతానికి ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:22PM