- ఆగిఉన్న లారిని డీ కోన్న కారు
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి టోల్ ప్లాజా, 44 నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన అంది నగేష్ 35 అనే వ్యక్తి ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అందే నగేష్ అతని భార్య నదియా, తమ్ముడు నవీన్ దుబాయ్ వెళ్లాల్సి ఉండగా నవీన్ తో పాటు అతని స్నేహితుడు వెంకటేష్ గౌడ్ ని వెంటబెట్టుకొని కారులో ఆర్మూర్ కామారెడ్డి మీదుగా బయలుదేరి శేంషబాద్ ఎయిర్పోర్టులో నవీన్ ని వదిలి తిరిగి స్వగృహానికి వస్తుండగా మార్గమధ్యంలోని ఇందల్ వాయి టోల్ ప్లాజా దాటగానే కోరుతోంది దురంలో పార్క్ చేసి ఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న అందే నగేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.కోద్ది దూరం లోనే ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది ఘటన స్థలనికి చేరుకుని టోల్ ప్లాజా హైవే అంబులెన్స్ లో నగేష్ ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అయన మృతి చెందాడు. కారు నడుపుతున్న వెంకటేష్ గౌడ్ కు స్వల్ప గాయాలయ్యాయి. నగేష్ మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు.గాయవ పాలైన వెంకటేష్ గౌడ్ కు ఆసుపత్రి లోనే చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. మృతుడి భార్య నదియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:24PM