- రాష్ట్రానికి నిధుల కేటాయింపు పై నేను చెప్పిన లెక్కలు తప్పని తేలితే రాజీనామాకు సిద్ధం
- కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ లో నిధులు సాధించేలా చూడండి
- రాష్ట్ర బీ జే పీ నేతలకు మంత్రి కేటీఆర్ హితవు
- దేశాన్ని అప్పుల పాలు చేయడంలో 14 మంది ప్రధానులను మించిపోయిన నరేంద్ర మోడీ
- ఇప్పటికే దేశం 100 లక్షల కోట్ల అప్పుల పాలైంది
- రాష్ట్రంలో మేము చేసిన అప్పులు భవిష్యత్తు తరాల కోసమే
నవతెలంగాణ-కంటేశ్వర్
బీ జే పీ నేతలకు దమ్ముంటే పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మద్యంతర ఎన్నికల్లో మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో నిరూపించుకుందామని మంత్రిఘాటుగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందని, విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వివక్షత చూపిస్తుందని ఆరోపించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ చివరిదని, రాష్ట్ర బీ జే పీ నేతలు నిధులు సాధించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాడా లని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతలకు అంకితభావం ఉంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దేవుడంటున్న నేతలు ఏ విషయంలో దేవు డో స్పష్టత ఇవ్వాలన్నారు. గ్యాస్ ధర పెట్రోల్ ధర నిత్యవసర సరుకుల ధరలు పెంచినందుకు దేవుడా, ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నందుకు దేవుడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిన హామీలను నెరవేర్చకుండా కేవలం సంస్కారహీనంగా మాట్లాడుతున్న రాష్ట్ర బీ జే పీ నేతలు అభివృద్ధిపై తమ సత్తా చాటుకోవాలన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా అభివృద్ధి కోసం కేటాయించకపోవడం శోచనీయమన్నారు. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి, ఇక్కడ ఉన్న జూట్ బోర్డును ఎత్తేసారని ఆయన మండిపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కాలేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణపై కక్ష సదింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్న పన్నులను ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నరని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధుల పై తాను చెప్పిన లెక్కలు తప్పని తేలితే నేను రాజీనామాకు సిద్ధమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నినాదం సబ్ కా వికాస్, సబ్ కా జీవన్ , సబ్ కా బక్వాస్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో దేశం కోసం పనిచేసిన 14 మంది ప్రధాన మంత్రులు మొత్తం కలిసి 2014 వరకు 56 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే, కేవలం ఒకే ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనలో 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఆరోపించారు. ఈ అప్పుతో దేశంలోని ప్రతి పౌరుని పై 1,25,000 అప్పు ఉంటుందన్నారు. రాష్ట్రంలో తాము చేసిన అప్పు కేవలం భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసమేనని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంస్కారహీనవంతంగా మాట్లాడుతున్నాడని, కానీ మేము మాటల్లోకి దిగితే మీ తాత, తండ్రి గుర్తుకు వస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మీ తండ్రిని ఇప్పటికి గౌరవిస్తామని డీ ఎస్ నుద్దే శించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే ఆర్ సురేష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బీ ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశన్న జీవన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:29PM