నవతెలంగాణ -నవీపేట్
పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫకీరాబాద్ గ్రామంలో బట్టు నీల (45) ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై రాజారెడ్డి శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన బట్టు శంకర్ రోజులాగే పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న భార్య బట్టు నీల ఇంటిలోని ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోగా సాయంత్రం చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మహిళా మృతికి కారణం ఆర్థిక ఇబ్బందులే కావచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:31PM