నవతెలంగాణ- రామారెడ్డి
విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం ఏ సి డి చార్జీలతో నడ్డి విరుస్తుందని శనివారం మండలంలోని మద్దికుంటలో విద్యుత్ బకాయిలు వసూలు చేస్తున్న విద్యుత్ సిబ్బంది వద్ద ప్రజలు ఆందోళన చేశారు. ఇంటింటికి డబల్ బిల్లులు వసూలు చేయడం ఏంటని, విద్యుత్ సిబ్బందిని నిలదీశారు. విద్యుత్ అధికారులకు చరవాణి ద్వారా ఏసీ రీఛార్జిలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm