- ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి
నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని స్కూల్ తండా, జగదాంబ తాండ, బట్టు తండాలకు సరపరయ్య విద్యుత్ సబ్ స్టేషన్ లో ఒకటే బ్రేకర్ ఉండటం వలన రైతులకు ఇబ్బంది కలుగుతుందని శనివారం ఆయా గ్రామాల సర్పంచు విద్యుత్ అధికారి యస్ ఇని ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డితో కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు. వచ్చే వేసవికాలం రైతుల పంటలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు, ఇబ్బందిగా ఉన్న బ్రేకర్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి విద్యుత్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు రాజు నాయక్, రెడ్డి నాయక్, బీఆర్ యస్ మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm