నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట గల సరస్వతి నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలకు కూడా హైదరాబాద్కు వెళ్లకుండా నిజాంబాద్ లోనే విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ నిజామాబాద్ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
నూతన అంగుళాలతో అత్యుత్తమ పరికరాలతో స్కానింగ్ సెంటర్లను సిటీ స్కాన్ డయాగ్నస్టిక్ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ వివేకానంద ఎంబీబీఎస్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ప్రజల కోసం నూతన అంగుళాలతో విశ్వం డయాగ్నస్టిక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్లు కోరారు.
ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యాన్ని అందిస్తామని అతి తక్కువ ధరలలో సామాన్య ప్రజలు కూడా డయాగ్నస్టిక్ సెంటర్లో స్కానింగ్లు చేయించుకోవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, నగర మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీఎస్ డబ్ల్యూ డి సి చైర్పర్సన్ ఆకుల లలిత, స్థానిక కార్పొరేటర్ బైకాన్ సుధా మధు, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రామచందర్ ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతి లతోపాటు కోదాడ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ విజయ్ ఎం డి ఎస్, డాక్టర్ ఎండి విష్రూత్ రేడియాలజిస్ట్, వసంత, నవ్య శ్రీ, కావ్య, విజయ స్కూల్ కార్యదర్శి అమృతలత, విజయ్ హై స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:34PM