నవతెలంగాణ -నవీపేట్
మామ అవమానించాడని అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోని యంచ గోదావరిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ ఉప్పుగూడ కు చెందిన ఆర్థం సందీప్(30) తన భార్య ప్రియ చెల్లెలు మరదలు వివాహానికి ఈనెల 26వ తేదీన నిజామాబాద్ కు వచ్చారు. పెళ్లి అనంతరం సందీప్ మామ కొండా నాగేందర్ డబ్బుల విషయంలో అసభ్య పదజాలంతో దూషించి అందరి ముందు అవమానించడంతో మనస్థాపం చెంది ఈరోజు మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో యంచ గోదావరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు అతని స్నేహితులకు తన మామ తనను అవమానించాడని వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడని తన కుమారుడి మృతికి మామ నాగేందర్ కారణమని మృతుడి తండ్రి మనోహర్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మృతుడికి రెండున్నర సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:36PM