నవతెలంగాణ-శంకరపట్నం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని చర్లపల్లి & పాపయ్యపల్లి గ్రామంలో సమ్ము శ్రీనివాస్ (41) ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. గత రెండు, మూడు, సంవత్సరాలుగా పంట దిగుబడి రాక అప్పుల బాధ భరించలేక సతమతమ వుతు తాగుడుకు బానిసైన సమ్ము శ్రీనివాస్ శుక్రవారం సాయంకాలం సమయంలో తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు., మృతుడి భార్య సమ్ము లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం కేశవపట్నం పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm