- వివరాలు వెల్లడించిన నిజామాబాద్ ఆరవ పోలీస్స్టేషన్ ఎస్ఐ
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని అసద్ బాబా నగర్ లో ఆదివారం రాత్రి ఒకరు హత్యకు గురయ్యారు. అసద్ బాబా నగర్ లోని రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్న అహ్మద్ ఖాన్ (52) ని అది అపార్ట్మెంట్ లో నివాసముంటున్న భాష కత్తితో పొడవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
అపార్ట్మెంట్ డ్రైనేజీ సిస్టం పాడవడంతో దాన్ని అహ్మద్ ఖాన్, మునీర్ లు రిపేర్ చేస్తుండగా పాషా తో గొడవపడ్డాడు. ఆ సమయంలో అహ్మద్ ఖాన్, పాషా ను కొట్టాడు. దానితో ఆగ్రహంతో ఉన్న పాషా స్థానికంగా ఉండే తన స్నేహితుడు అక్తర్ ను రప్పించాడు . తన ఇంటిలో నుంచీ కత్తిని తీసుకొచ్చి అహ్మద్ ఖాన్ గుండెలో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన అక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మరణించాడు. బద్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Jan,2023 03:52PM