నవతెలంగాణ-కొత్తగూడ
ప్రజలు, నేటి విద్యార్థి యువకులంతా గాంధీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీజీ అనుసరించిన శాంతియుత మార్గం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. శాంతి, మత సామరస్యాన్ని కాపాడటమే గాంధీజీకి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు అరెం పాపారావు, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర బోయిన మొగిలి,గోవిందపురం సర్పంచ్ ఇరుప రాజేశ్వర్ రావు, కిసాన్ మజ్దూర్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉల్లెంగుల రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వీరనేని వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ గుమ్మడి సమ్మయ్య, నాయకులు కంగాల నాగేశ్వర్ రావు, దేశ్య, రమేష్ , మల్లన్న, సంపత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Jan,2023 03:55PM