నవతెలంగాణ-భిక్కనూర్
బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బాల్య వివాహాల నివారణ పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు 18 సంవత్సరం వచ్చేవరకు వివాహాలు చేయవద్దని, బాల్యవివాహాలు జరిగితే అంగన్వాడీ టీచర్లు బాధ్యత వాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్ మంజుల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, ఎంపీటీసీ లీలావతి బాలా గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అమరావతి సిద్ధిరామిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Jan,2023 05:28PM