నవతెలంగాణ-కన్నాయిగూడెం
శ్రీనిధి లోన్స్ లో భారీ అవకతవకలు,అనే కథనం పై శ్రీనిధి అధికారులు,స్పందించి లక్ష్మీపూర్ గ్రామంలోని మహిళ పొదుపు సంఘాల,శ్రీనిధి లోన్స్ లో జరిగిన అవకతవకలపై విచారించారు.కానీ అక్కడ ఎంత మొత్తంలో అవినీతి జరిగింది, ఏన్ని సంఘాల జమ డబ్బులు అప్పులేకున్నా వేరే అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేసారని, ఏమీ తేల్చలేదని మహిళ సంఘాల సభ్యులు చెపుతున్నారు. అలాగే శ్రీనిధి లోన్స్ లో ఎక్కువ వడ్డీ వసూలు చేసి ఒక్కక్క సభ్యుని వద్ద 20000 రూపాయల పైన వసూలు చేశారని సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.
అలాగే విచారణకు వచ్చిన అధికారులు మాత్రం అవకతవకలు జరగలేదని, పొరపాట్లు జరిగినాయని, శ్రీనిధి సిబ్బందిని వెనకేసుకొని మాట్లాడుతున్నారని, సంఘాల సభ్యులు అంటున్నారు. ఈ పొరపాట్లను ఫిబ్రవరి 25 వరకు సరి చెయ్యాలని, శ్రీనిధి అధికారులు స్థానిక శ్రీనిధి అధికారులకు గ్రామఐక్యసంఘం లీడర్స్ కి సూచించినట్టు సమాచారం. ఈ విచారణలో డీపీఎం ఫైనాన్స్ డి అర్ డి ఏ
అనిల్, రిజనల్ మేనేజర్. మహేష్, శ్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ ఎపియం కమలాకర్ సులోచన పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Jan,2023 06:42PM