- అశ్వారావుపేట లో గాంధి వర్ధంతి
నవతెలంగాణ - అశ్వారావుపేట
స్వాతంత్ర సమరయోధులు,జాతిపిత మహాత్మా గాంధి వర్ధంతి ని సోమవారం మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో కార్యాలయం లో,అశ్వారావుపేట పూర్వ ప్రధాన రహదారిలో గల గాంధీ కూడలి లో ఆర్యవైశ్యులు ఆద్వర్యంలో నిర్వహించారు.కార్యాలయం ప్రాంగణంలో గల గాంధీ విగ్రహానికి,గాంధీ కూడలి లోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.ఇ.ఓ సీతారామరాజు,సూపర్ డెంట్ ప్రసాద్,ఎల్.డి.సి శ్రీనివాస్,ఈ.సి నరేష్,టైపిస్ట్ ప్రసాద్,కంప్యూటర్ ఆపరేటర్ రాజేశ్వరి,అటేండర్స్ చారి,కుమారి, పాషా,కాంగ్రెస్ నియోజక వర్గం నాయకులు మొగలపు చెన్నకేశవరావు, వగ్గేల పూజ, ప్రచార కార్యదర్శి, ఆర్యవైశ్య సంఘం మండల సెక్రెటరీ జల్లిపల్లి దేవరాజు, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే పాషా, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూసి పాండురంగ,ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ ఎంపీటీసీ,సత్యవరపు తిరుమల బాలయ్య,బండారు మహేష్ లు పాల్గొన్నారు.