నవతెలంగాణ కంఠేశ్వర్
రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కుష్టు నిర్మల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఇందూరు సైకియాట్రిక్ ఆస్పత్రి నందు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ టి దినేష్ కుమార్ హాజరై ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ నేటి రోజులలో కుష్టు అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్మూలనలో దగ్గరగా ఉందని అది ప్రాథమిక దశలోని గుర్తించినట్లయితే అతి త్వరగా నయం చేసుకొని జబ్బు అని దాని కొరకు ఎక్కువగా హైదరాబాదులో పడాల్సిన అవసరం లేదని చక్కటి ఆరోగ్యవంతమైన జీవనాన్ని జీవించినట్లయితే బ్యాక్టీరియాలకు దూరంగా ఉన్నట్లయితే ఎటువంటి జబ్బులు కూడా దరిచేరమని అందుకే మనిషి ఎప్పుడు స్వతహాగా నీటిగా ఉండడానికి ప్రాముఖ్యత చూపాలని అన్నారు. తదనంతరం వారికి క్లబ్ తరఫున సత్కారం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ బి రాజేంద్రప్రసాద్ రాజకుమార్ సుబేదార్ వి శ్రీనివాసరావు రామకృష్ణ వాసు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.