- కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత బకాయి వేతనాలు చట్టబద్ధ హక్కులను కల్పించాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పైన ధర్నా నిర్వహించి, అనంతరం సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్, మిషన్ భగీరథ జిల్లా అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతు..రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ స్కీం లో పంపు ఆపరేటర్, లైన్మెన్, ఫిట్టర్ ఎలక్ట్రిషన్ ఆపరేటర్స్, వాలు ఆపరేటర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, వాచెమెన్, సూపర్వైజర్ తదితర హోదాల్లో పనిచేస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లో సుమారు 16 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. భగీరధ కార్మికుల శ్రమ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక బహుమతులు వచ్చాయి. కార్మికుల స్థితి ఏమాత్రం బాగోలేదు.. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్నారు. మిషన్ భగీరథ స్కీం నిర్వహణకు తీసుకున్న కంపెనీలు కార్మికుల పొట్ట కొడుతున్నాయి, కనీస వేతనాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీని ఫలితంగా మిషన్ భగీరథ కార్మికులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చే ఎస్ ఎస్ ఆర్ రేట్లు 18 వేలకు పైగా చూయిస్తున్నారు కానీ కార్మికులకు మాత్రం 8500 నుండి 12వేల రూపాయల లోపు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం ప్రభుత్వం చెల్లించినఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఆయన వేతనాలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. గతంలో ఆర్ డబ్ల్యూఎస్ స్క్రీమ్ ను ప్రస్తుతం మిషన్ భగీరథ గా మార్చారు ఆర్ డబ్ల్యూఎస్ స్కీం గా కొనసాగుతున్నప్పుడు. కార్మికులకు జీవో నెంబర్ 11 అమలు అవుతుండేది ప్రస్తుతం జీవో ఎంఎస్ నెంబర్ 11 భగీరథ స్కీం లో పనిచేసే .కార్మికులకు అమలు చేయడం లేదు, కార్మికులు జీవో నెంబర్ 11 అమలు చేయాలని పట్టుబడుతున్నారు. లైన్మెన్ ల పరిస్థితి కడు దరిద్రంగా ఉన్నది వచ్చే 8500 వేతనంలో పెట్రోల్ అలవెన్స్ కిందనే సుమారు 3000 రూపాయలు ఖర్చవుతుంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నీళ్ళు అందించడం అనేది భగీరథ స్కీం లోనే జరుగుతుంది. ఇది చట్ట విరుద్ధం వెంటనే లైన్మెన్ లకు ట్రావెల్ అలవెన్సులు చెల్లించాలి. స్కీం లో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరుతున్నాము. మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని తెలిపారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి.ఉద్యోగ భద్రత, 20 శాతం బోనస్, రక్షణ పరికరాలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ నేరుగా డిపార్ట్మెంట్ జమ చేయాలి. సంవత్సరానికి 15 రోజులు వేతనంతో కూడిన సెలవులుఅమలు చేయాలి..లైన్మెన్ కు తక్షణమే ట్రావెల్ అలవెన్సులు చెల్లించాలి. లేదా నిబంధనల ప్రకారం 15 కిలోమీటర్లకు ఒకరు చొప్పున నియమించాలి. వేతనాలు సకాలంలో చెల్లించని కంపెనీలను బ్లాక్ లిస్టులో ఉంచాలి. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి.జీవో నెంబర్ 60 లేదా జీవో నెంబర్ 11 అమలు చేయాలి. కంపెనీలు కాకుండా మిషన్ భగీరథ స్కీమ్ నుండే నేరుగా జీతభత్యాలు కార్మికులకు చెల్లించాలి. 8 గంటల పని దినము అమలు చేయాలి.సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 6న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ జిల్లా నాయకులు, బార్ రాజు, ప్రేమ్ తారాచంద్ జనార్ధన్ స్వామి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 04:48PM