- అండాశయంలో గల కణతి లను తొలగించి ఇద్దరు మహిళలకు చికిత్స అందించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వెన్నుముక విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్న రోజు ఒకడికి ఆపరేషన్ చేసి పేద ప్రజలకు వెన్నుముకగా ప్రభుత్వ ఆసుపత్రి నిలిచిందని, అదేవిధంగా ఇద్దరు మహిళలకు అండాశయంలో గల కణతులను తొలగించి చికిత్సను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు అందించాలని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ..వైద్య రంగానికి ప్రాముఖ్యత ఇచ్చి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ,వైద్య అధికారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కి ,ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు కి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన చికిత్సల విషయంలో వివరాల్లోకి వెళితే..సరస్వతి 25 సంవత్సరాలు గల నవీపేట్ గ్రామానికి చెందిన యువతి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చినది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అన్ని రకాల పరీక్షలు ఆమె అండాశయంలో ఒక పెద్ద కణతిని గుర్తించారు ఆ కణతే చాలా పెద్ద పరిమాణంలో ఉండడం వల్ల మూత్రపిండాలపై ప్రభావం చూపి మూత్రనాళా ఒత్తిడి గురైనవని వాటికి స్టెంట్ వేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో యూరాలజిస్ట్ లేనందున ప్రైవేట్ డాక్టర్ రాఘవేంద్ర గారిని సంప్రదించగా సేవా దృక్పథంతో ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుని మూత్రపిండాలకు ఎలాంటి సమస్య రాకుండా చాలా జాగ్రత్తగా మూత్రనాళాలకు స్టంట్ వేయడం జరిగిందని తెలిపారు తర్వాత గైనకాలజీ డాక్టర్లు యువతి చిన్న వయసులో ఉన్నదని ఇంకా పిల్లలు లేరని భవిష్యత్తులో సంతానం కలగడంలో ఎటువంటి సమస్య రాకుండా చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ నిర్వహించి ఆ యువతి అండాశయం నుంచి కణతిని తొలగించడం జరిగింది.అలాగే పోసాని 58 సంవత్సరాల వయసు నిర్మల్ కు చెందిన మహిళకు అండాశయంలో మెలికలు తిరిగిన కణతిని గుర్తించి ఆవిడకు అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించి చికిత్స అందించడం జరిగింది. ఆనంద్ 22 సంవత్సరాల వయసు హనుమాజీపేట్ గ్రామానికి చెందిన యువకుడు ఒక ప్రమాదంలో వెన్నెముక లో మూడు ఎముకలు విరిగిపోయి నడవలేని మరియు కదలలేని స్థితిలో ఉన్నాడు అతను ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోగా దాదాపు మూడు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియడంతో కృంగిపోయి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇలాంటి వాటికి చికిత్స అందిస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి రాగా అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి డాక్టర్ నాగేశ్వర రావు ఎముకల విభాగాధిపతి గారు మరియు వారి వైద్య బృందం ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు అతను స్వయంగా నడుచుకుంటూ వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ రెండు శస్త్ర చికిత్సలు ప్రైవేట్ లో అయితే లక్షలతో కూడుకున్నదని ఇక్కడ ఉచితంగా నిర్వహించి వారికి ఆర్థిక భారాన్ని తగ్గించామని తెలియజేశారు.ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన గైనకాలోజి విభాగం డాక్టర్.నీలిమ సింగ్, ప్రొఫెసర్ గైనకాలోజి డాక్టర్ మధులత గైనకాలోజి విభాగాధిపతి, డాక్టర్ సరోజ మరియు డాక్టర్ అపర్ణకు, ఎముకల విభాగం డాక్టర్ నాగేశ్వరరావు విభాగాధిపతి వారి టీంకు అనస్తిశియ విభాగం డాక్టర్ కిరణ్ , విభాగాధిపతి, డాక్టర్ సుజయ్ కు
బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేషెంట్ల బంధువులు మాట్లాడుతూ తమకు ఎటువంటి ఖర్చు లేకుండా నాకు అన్న వసతులు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆసుపత్రి సుపరిండెంట్ కి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 05:11PM