నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల ఎంపీఓ రాజ్ కాంత్ రావు కు 26 జనవరి ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంపీఓ గా అవార్డు పొందడం పట్ల ఎంపీపీ భదవత్ రమేష్ నాయక్, ఎంపీడీవో రాములు నాయక్ ల ఆధ్వర్యంలో సోమవారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయం లో ఘనంగా సన్మానించారు. ఎంపీఓ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను చేపిస్తూ అందరి మన్ననలు పొందారని, వీధుల్లో అంకితభావంతో ఉంటూ గ్రామాల్లో ఉండే అధికారులతో పనులు చేయించడంలో ఎంపీఓ రాజ్ కాంతారావు ముందు వరసలో ఉంటారని వారన్నారు. దీనితో ఎంపీ ఓ రాజ్ కాంత్ రావు కు ఈ అవార్డు వరించిందని, రాబోవు రోజుల్లో రాష్ట్రస్థాయి అవార్డుల తోపాటు రివార్డులు పొందే విధంగా చూడాలని వారన్నారు. ఆయన ఎక్కడ వీధులు నిర్వర్తించిన తన మంచితనంతో తమ కిందిస్థాయి సిబ్బందితో పనులను చేయించడంలో మరెవ్వరు సాటి లేరని వారన్నారు. అనంతరం పలువురు ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు అరటి రఘు సిహెచ్ దాస్, జూనియర్ అసిస్టెంట్లు విమలబాయి, లింగన్న, లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు భరత్, వినయ్, తిరుపతి, యశ్వంత్, కార్యాలయ సిబ్బంది నారాయణ, బక్కన్నతో పాటు తదితరులు ఉన్నారు.