నవతెలంగాణ కంఠేశ్వర్
అంగన్వాడి సమస్యల పైన ఫిబ్రవరి 3 నుండి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీచర్లతో సమానంగా వేతనం పెన్షన్ ఎస్సై ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే కి వినతిపత్రం ఇవ్వడానికి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ మాట్లాడుతూ..
2023 ఫిబ్రవరి 3 నుండి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యల పైన శాసనసభ్యులు అర్బన్ ఎమ్మెల్యే గారికి మీరు మాట్లాడాలని, ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు పెంచే విధంగా తమరు కృషి చేయాలని కోరుతున్నాము అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. గత 40 సం॥లకు పైగా ఐసిడిఎస్ పని చేస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవి ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారు. కానీ టీచర్లతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. టీచర్లతో సమానంగా వేతనం తదితర సౌకర్యాలు కల్పించాలని, ప్రగతి భవన్ సమావేశంలో ముఖ్యమంత్రిగారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్నారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.5 లక్షలు, హెల్పర్లకు రూ.3 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని అనేక సం॥రాల నుండి అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రంలో అడుగుతున్నారు. 2022 మే నెలకు అంగన్వాడీ ఉద్యోగుల 1972 గ్రాట్యుటీ చట్టం వర్తింపజేయాలని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా తెలంగాణ ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదు. దీనివల్ల వయస్సు పైబడ్డ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2017 నుండి టిఎడిఎలు, ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్సులు ప్రభుత్వం చెల్లించడం లేదు. 2018లో కేంద్రం పెంచిన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించడం లేదు. కేంద్రం పెట్టిన పోషన్ కర్ యాప్ ఉంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎనచీఎస్ యాప్ను పెట్టడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులకు పని భారం పెరగడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలతో అంగన్వాడీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని పరిష్కరించని యేడల 2023 మార్చి 1,2,3 తేదీలలో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని తెలియజేస్తున్నాము. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి. ఐసిడిఎస్ కు నష్టం కల్గించే నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలి.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి. టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలి.2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500/-లు, హెల్పర్లకు రూ.750/ -లు, మినీ వర్కర్లకు రూ.1,250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్తో సహా చెల్లించాలి.2017 నుండి టిఎ, డిఎ బకాయిలు మొత్తం చెల్లించాలి. దీనికి సరిపడా బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలి.3 సం॥రాల రేషన్ షాపు ట్రాన్స్పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి. పిఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలవి వెంటనే చెల్లించాలి.ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలి.మదర్స్ కమిటీలకు చైర్మన్గా తల్లులను మత్రమే నియమించాలి. గ్రామ సర్పంచులను చైర్మన్ నియమాకం చేసే పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలి.ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పై॥ల నుండి రూ.5/-లకు, గర్భిణీ/బాలింతలకు రూ.2.40 పై॥ల నుండి రూ.10/-లకు పెంచాలి. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలి.ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లంటినీ మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి. అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలి.2017 నుండి ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి. 1ఎన్హెచ్ఎస్ యాప్ను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలి. అన్లైన్ పని చేయడానికి వీలుగా ఐప్యాడ్ అంగన్వాడీలకు ఇవ్వాలి. అంగన్వాడీ ఉద్యోగులకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. 16. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు (ఈవెంట్స్) ఇచ్చే డబ్బులు రూ.250/-ల నుండి రూ.2,000/-లకు పెంచాలి. రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వెహికల్ ద్వారానే సప్లై చేయాలి.ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలి. జివో.నెం. 14, 19. 8 లను వెంటనే సవరించాలి.అంగన్ వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణలక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పధాకలు అమలు చేయాలి.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ, వాణి, జరీనా తదితరులు పాల్గొన్నారు.