- కరపత్రాలను ఆవిష్కరణ..
- ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆటల నిర్వహణ..
నవతెలంగాణ డిచ్ పల్లి
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆటల పోటీల కరపత్రాలను యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల వద్ద మంగళవారం ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దత్తహరి, స్పోర్ట్స్ ఇంచార్జ్ డాక్టర్ నేత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉత్సాహం ఇస్తాయన్నారు. ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న ఆటల కార్యక్రమాన్ని యూనివర్సిటీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి శ్రీశైలం మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ పోరాటాలతో పాటుగా అనేక సాంస్కృతిక, ఆటల కార్యక్రమాల నూ నిర్వహిస్తూ ఉంటుందన్నారు. ఆటలతో శారీరిక, మానసిక ఒత్తిడి అధిగమించే ప్రక్రియగా అభివర్ణించడం జరిగిందని ఆయన వివరించారు. తెలంగాణ యూనివర్సిటీలోమొట్టమొదటిసారిగా ఎస్ఎఫ్ఐ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని, పాలక ప్రభుత్వాలు తెలంగాణ యూనివర్సిటీ కి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్, జిల్లాలోని ఇతర నీయోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రత్యేక కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ మహాసభల సందర్భంగా ఆటలో గెలిచిన జట్లకు బహుమతులను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్, వెంకటేష్, సంధ్య, సాయి ప్రసాద్, ఆదిత్య, తదితర నాయకులు పాల్గొన్నారు.