-నేడు గుండారంలోని పాఠశాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే
-రూ.41 లక్షలతో పూర్తయిన మన ఊరు-మన బడి పనులు
నవతెలంగాణ-బెజ్జంకి
గతంలో అధ్వానస్థిలో ఉన్న పాఠశాలలు నేడు మన ఊరు-మన బడితో అమోగంగా మారతున్నాయి.విద్యార్థులకు మేరుగైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించి కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే గోప్ప సంకల్పంతో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వార ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మాణ పనులకు నాంధి పలికింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.మండలంలో 12 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.5 కోట్ల నిధులు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వార మంజారయ్యాయి.మొదటి విడతగా గుండారం, రేగులపల్లి, కల్లేపల్లి, బేగంపేట, గుగ్గీల్ల, బెజ్జంకి గ్రామాల్లోని పాఠశాలల్లో మన ఊరు-మన బడి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.గుండారంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.4.69 లక్షలతో చేపట్టిన మన ఊరు-మన బడి నిర్మాణ పనులు పూర్తయి సకల సౌకర్యాలతో పాఠశాల భవనం నూతన శోభను సంతరించుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.మొదటి విడతగా గుండారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.41 లక్షలు(మన ఊరు-మన బడి రూ.4.69 లక్షలు) ఈజీఎస్ (ప్రహరీ గోడ,వంటశాల నిర్మాణం రూ.36.40 లక్షల) నిధులతో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వార చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయి నేడు(బుధవారం) మానకోండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
రవాణలో పాఠశాల పర్నీచర్ ..
పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైన గుండారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తరగతి గదిలో పర్నీచర్ సామాగ్రి అందుబాటులోకి రాలేదు.విద్యార్థులకు త్రాగు నీరు,విద్యుత్,మూత్రశాలలు,భోధన సామాగ్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తిసుకువచ్చామని పర్నీచర్ రవాణలో ఉందని ఎంఈఓ పావని తెలిపారు.
-మన ఊరు-మన బడితో ప్రవేశాలు మేరుగు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కోసం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం రాబోయే రోజుల్లో మంచి సత్పలితాలిస్తుంది.పాఠశాలల్లో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు,మౌలిక వసతులు కల్పనతో విద్యార్థుల ప్రవేశాలు మేరుగవుతాయి.ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తాను.
-రామంచ రవీందర్,ప్రధానోపాద్యాయులు.
మొదటి విడత ప్రారంభోత్సమవ్వడం ఆనందనీయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి పనులు పూర్తయి మొదటి విడతగా మండలంలోని గుండారం గ్రామ ప్రాథమిక పాఠశాల మొట్టమొదటగా ప్రారంభోత్సవమవ్వడం ఆనంధనీయం.మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వార నిధులు కేటాయించి పనులు పూర్తవ్వడానికి కృషిచేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చోరవ,అధికారుల శ్రద్ధ ఆనంధనీయం.
-శెట్టి లావణ్య,సర్పంచ్ గుండారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 05:45PM