నవతెలంగాణ - అశ్వారావుపేట
వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు అబ్జల్ బేగం జాతీయ స్థాయి శటిల్ బాడ్మింటన్ క్రీడల్లో రానణిస్తున్నారు.జనవరి 31 మంగళవారం నుండి ఫిబ్రవరి 6 సోమవారం వరకు గుజరాత్ లోని గాంధీనగర్ లో గల సచివాలయం జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ సెటిల్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో ఆమె పాల్గొంటున్నారు. మొదటి రోజు మంగళవారం మొదటి మ్యాచ్ లో రాయ్ పూర్ సెటిల్ బాడ్మింటన్ పై విజయం సాధించారు.రెండో మ్యాచ్ లో చండీఘర్ లో సింగిల్ విభాగంలో గెలుపొందారు. ఈ విజయం ద్వార అబ్జల్ బేగం తెలంగాణా రాష్ట్రం తరుపున ఆమె జాతీయ క్రీడల్లో రాణిస్తుండంతో అశ్వారావుపేట ఏ.ఓ నవీన్ కుమార్,ఏ.ఈ.ఓ లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేసారు.