నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి గ్రామంలో కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్, పద్మపాని స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో వరి సాగులో తడి పొడి విధానం అమలు చేసే రైతులకు నీటి గొట్టాలు ఎలా అమర్చాలో మండల కో ఆర్డినేటర్ మనోజ్ కుమార్ రైతులకు వివరించారు. మంగళవారం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో నీటి గొట్టం అమర్చి రైతులకు డెమో చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మదు మోహన్ రెడ్డి, ఏయంసి చైర్మన్ భగవంత్ రెడ్డి, విండో చైర్మన్ వెంకట్ రెడ్డి,ఎంపీటీసీ మంజుల,ఏఓ రాధ, ఏఈఓ రజిత,ఆర్బిఎస్ చైర్మన్ గంగారెడ్డి, మండల కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm