నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో వరి పంటలను శాస్త్రవేత్తలు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించారు. వరి పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ నుండి ప్రధాన వరి శాస్త్రవేత్త డాక్టర్ పి రఘురామిరెడ్డి, డాక్టర్ వర్మ, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ బాబు, కెవికె రుద్రూర్ నుండి డాక్టర్ ఎస్ నవీన్ కుమార్, డాక్టర్ రాజ్ కుమార్, సురేష్, విజయ్ శాస్త్రవేత్తలు బృందం మండలంలోని వరి పొలాలను పరిశీలించారు. వరి ఎండిపోవడానికి గమనించి రైతులకు తగు సూచనలు సలహాలు అందజేశారు. ప్రస్తుతం నాటు వేసిన తర్వాత 30 నుండి 35 రోజులు సమయంలో 25 కేజీల యూరియా, 200 గ్రాముల కార్బన్డైజమ్, మాంకొజెబ్ కలిపి వేసుకోవాలని, పొలాన్ని అడపాదడపా ఆరబెట్టుకోవాలని సూచించారు. వరి చిరు పొట్ట దశకు వచ్చిన సమయంలో తప్పనిసరిగా ఒక ఎకరానికి 60 ఎంఎల్ కోరాజైన్ మందును స్ప్రే చేయడం వలన తెల్ల కంకి నివారణ అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ అపర్ణ, ఏవో రాధా, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, రామేశ్వర్ పల్లి సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి, ఏఈవోలు వినోద్, రవి, ఆనంద్, రజిత, అఖిలేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 06:11PM