- గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందజేత
- నగర మేయర్ నీతూ కిరణ్..
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ లాంటి నగరంలో సీఈవో రత్నాకర్ హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైన్ కళాశాల నెలకొల్పడం అభినదనీయం అని నగర మేయర్ నీతూకిరణ్ అన్నారు.మంగళవారం ఇన్ఫినిటీ హోటల్ మనేజ్మెంట్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ..తెలంగాణ వంటలు దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గాంచినవని మంచి మంచి వంటలు చేసి ఇందురుకు పెరు తీసుకురావాలని అన్నారు.ప్రస్తుతం ఉన్న తరుణంలో ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మనేజ్మెంట్ కు ఆదరణ ఉందని ఈ కోర్స్ ఎంచుకోవడం, నిజామాబాద్ లో ఇలాంటి కళశాల నెలకొల్పడం శుభపరిణామం అన్నారు.భవిష్యత్ లో మంచి పొజిషన్ కు రావాలని తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని కోరారు..ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కన్వీనర్ వినయ్ సాగర్ జె ఎన్ టి ఈ, సి ఎస్ హైదరాబాద్ విచ్చేసి విద్యార్థులకు విలువైన టిప్స్ నేర్పించారు. అనంతరం ముఖ్య అతిధుల చేతుల మిదిగా 6 వ బ్యాచ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో రజిత, స్వర్ణ లత, రాజేశ్వర్, శశి తదితరులు పాల్గొన్నారు.