నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం, కన్నెపల్లిలో మండమేలిగే (మినీ జాతర) పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద నేటి (బుధవారం) నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచిన సమ్మక్క-సారలమ్మ చిన్న జాతరకు వేళయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిధులను కూడా విడుదల చేసింది. మండమేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జాతరకు ఆలయ కమిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి 4వ తేదీ వరకు ఈ జాతర జరగనుందని అధికారులు ప్రకటించారు. కాగా, మేడారం చిన్న జాతర తేదీలు ఖారురు కావడంతో అధికారులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ జాతర కోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య చెప్పారు. ఈ నిధులను వివిధ శాఖలకు కేటాయించి జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నారు. అసలైన సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాల ఒకసారి జరుగుతుంది. ఈ మినీ జాతరకు 5 నుండి 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా. దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. స్నానాలకు జంపన్నవాగులో వాటర్ ట్యాప్‌లను అమర్చారు. మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులు కూడా అందుబాటులోకి తెచ్చారు. తాగునీటి కోసం మిషన్ భగీరథ కింద పది మినీవాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. వరంగల్, హన్మకొండ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు లను నడిపిస్తోంది.
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
నేటి నుండి (బుధవారం) మొదలయ్యే మినీ జాతరకు వారం రోజుల ముందు నుండే కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు డిపిఓ వెంకయ్య పూర్తి చేశారు. 300 మంది పారిశుద్ధ్య కార్మికుల తోటి జాతర పరిసరాలలో బస్టాండ్ మ్యూజియం టెంపుల్ చిలకలగుట్ట ఐటిడి క్యాంప్ ఆఫీస్ టెంపుల్ బయట ప్రాంతం హరిత హోటల్ షెడ్లు తదితర ప్రాంతాలలో టీములు ఏర్పాటు చేసి పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి ఎంపీఓగా బి శ్రీకాంత్ నాయుడు, ఇంకా ముగ్గురు ఇన్చార్జి ఎంపీఓ లు, మేడారం స్థానిక పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో 50 మంది ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. మేడారం పరిసరాలు క్లీన్ అండ్ గ్రీన్ గా పరిశుభ్రం నిరంతరం చేస్తున్నారు.
క్యూలైన్ల ద్వారా దర్శనం
మినీ జాతర సందర్భంగా మండే మెలిగే పండుగ కు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఎండోమెంట్ అధికారులు, పూజారులు కరన నియమ నిబంధనల ప్రకారం శానిటేషన్ చేస్తూ మాస్కులు అందుబాటులో ఉంచారు. క్యూలైన్ల ద్వారా దర్శనం చేస్తున్నారు. భక్తులకు కరోన గురించి అవేర్నెస్ చేస్తున్నారు. గద్దెల వద్దకు భక్తులు చేరుకోగానే తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దల ప్రాంగణంలో ఎక్కువ సమయం భక్తులు నిల్వ ఉండకుండా తొక్కిసలాట జరగకుండా పోలీసుల సహాయంతో అన్ని ఏర్పాట్లు చేశారు.
పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు
మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గద్దల ప్రాంగణంలోని ఎండోమెంట్ కార్యాలయం ప్రాంగణంలో పోలీసులు పోలీస్ ఔట్ పోస్ట్ (మినీ పోలీస్ స్టేషన్) కేంద్రం ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణంలో దొంగతనాలు, అసాంఘిక చర్యలు జరగకుండా పటిష్ట భద్రత చర్యల్లో భాగంగా మినీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. బాధితులకు అక్కడనే సత్వర న్యాయం జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ములుగు జిల్లా గౌస్ ఆలం ఆదేశాల ప్రకారం తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
మినీ జాతరకు అన్ని ఏర్పాట్లు
పూజారుల సంఘం, ఎండోమెంట్
నేటి నుండి నిర్వహించే మినీ జాతర (మండెలిగే పండుగ) కు ప్రభుత్వం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసిన సకల సౌకర్యాలు కల్పించారని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతలను దర్శించుకోవచ్చు అని పేర్కొన్నారు. మంగళవారం పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, ఎండోమెంట్ సిబ్బంది ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మినీ జాతర విజయవంతం చేయడానికి, అధికారులతో సమన్వయం చేసుకోవడానికి అన్ని అంశాలను చర్చించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో చర్చించారు. సందర్భంగా పూజల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం మాట్లాడుతూ నేడు బుధవారం నుండి మినీ మేడారం జాతర మండ మెలిగే పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శించుకోవాలని అన్నారు. మేడారంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. తాగునీరు, వైద్యం, రవాణా, విద్యుత్తు, బట్టలు మార్చుకునే గదులు, జప్పన్న జంపన్న వాగు వద్ద స్నానాలు చేయడానికి బ్యాటరీ ఆఫ్ టాప్స్, మరుగుదొడ్లు, శానిటేషన్ మొదలైన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చి వనదేవతలు దర్శించుకుని వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళవచ్చని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 07:31PM