నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఈసన్నా పల్లి రామారెడ్డి లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం సింధూర పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాలతి సంతోష్ గుప్త, ఆలయ ఈవో ప్రభు, పాలకవర్గ సభ్యులు, పూజార్లు శ్రీనివాస్ శర్మ, సిబ్బంది సురేందర్, నాగరాజు తదితరులు ఉన్నారు.