నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేటలో సోమవారం గొర్లమందపై కుక్కల దాడిలో 33 గోర్లు మృతిచెందగా, మంగళవారం బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నరస గౌడ్ రూ, 11000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరస గౌడ్ మాట్లాడుతూ.... గొర్రెలు మృతి చెంది నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దన్ సింగ్, నాయిని నర్సింలు, ఇర్షాద్, కుమ్మరి శంకర్, చిన్న రాజయ్య, బాలయ్య, కాసిం, మహేష్, ఆశయ్య, ఎల్లయ్య, రెడ్డి నర్సింలు తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm