నవతెలంగాణ, రాజంపేట్ : మండలంలోని శివాయిపల్లి గ్రామం నందు గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మంగళవారం సి ఎం ఎస్ వర్షా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు మరియు పాఠశాల విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఈరోజు ఉచిత వైద్య శిబిరము నేర్వహిచంజరిగింది ఇట్టి కార్యక్రమంలో వైద్యులు చంద్రమోహన్ ఎంఎస్ జనరల్ సర్జన్,వర్ష స్త్రీ వైద్య నిపుణులు, శివాజీ జనరల్ మెడిసిన్ ఉచిత వైద్య శిబిరం లో పాల్గొని వచ్చిన గ్రామ ప్రజలకు, పాఠశాలలో విద్యార్థులకుఉచితంగా చూసి వారికి రక్త పరీక్షలు మరియు అందుబాటులో ఉన్న మందులను పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు విఠల్ రెడ్డి ,గ్రామ ఎంపీటీసీ బాలరాజు గౌడ్, ఉప సర్పంచ్ సంధ్య బాలరాజు, వి డి సి అధ్యక్షులు నీటురి రామారావు,విద్యకమిటీ చెర్మెన్ బాలరాజు ,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్వామి వర్ష హాస్పిటల్ యాజమాన్యం నవీన్ వినయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.