నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో 163 వ జాతీయ రహదారి అభివృద్ధి పనులు నత్తనడకన నాణ్యత లోపాలతో జరుగుతున్నాయి. 163 వ జాతీయ రహదారి అభివృద్ధి పనులపై పలువురు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ సంవత్సరకాలం సమీపిస్తున్న పనులను పూర్తికి చేయకపోవడం బాధాకరమని అన్నారు. నాటి నుండి నేటి వరకు పటేల్ కంపెనీ తీసిన గోతులతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గత 50 సంవత్సరాల కాలంలో ఇంత నిదానమైన పనులను తాము చూడలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. ద్విచక్ర వాహనదారులు పశువులు రహదారి నిమిత్తము తీసిన గోతులలో పడి గాయాల పాలవుతూ ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలుపుతున్నారు. అధికారులు కూడా నిద్రావస్థలోనే ఉన్నారని ప్రజల సమస్యలను పట్టించుకునే స్థితిలో లేరని అధికారులు విధి నిర్వహణలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. పని జరుగుతున్న తీరు కూడా నాణ్యత లోపాలతో నడుస్తుందని ఇది ఏమని అడిగితే అధికారుల నిబంధనల ప్రకారమే చేస్తున్నామని అవసరమైతే మీ దిక్కున కాడ చెప్పుకోమని సైట్ సూపర్వైజర్లు అమర్యాదగా మాట్లాడుతున్నారని అన్నారు. ట్రిప్పర్లు నడుస్తున్న క్రమంలో దుబ్బ విపరీతంగా లేస్తుంది అని ఇళ్లలో ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయని సూపర్వైజర్లకు తెలిపితే నీరు చల్లించాలని చెప్పినా పెడచెవిన పెట్టి పనులు నడిపిస్తున్నారని డి ఈ కి తెలిపిన కూడా ఫలితం లేకపోయిందని అన్నారు. నేషనల్ హైవే డి ఈ సంబంధిత గుత్తేదారుతో మాట్లాడి దుమ్ము లేవకుండా ఏర్పాట్లు చేస్తానని చెప్పినప్పటికిని సూపర్వైజర్లు పాటించకపోవడం అధికారుల మాటకు గుత్తేదారులు ఎలాంటి విలువ ఇస్తారో ఈ సందర్భంగా స్పష్టమైందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిక్కచ్చిగా ఉండి పనులను నాణ్యతతో నడిపించాలని గుత్తేదారు చేతిలో కబంధహస్తాల్లో బందీగా ఉండకుండా స్వచ్ఛందంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని గ్రహించి వ్యవహరించాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 07:34PM