నవతెలంగాణ డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లాలో గల పదవ తరగతి చదివే విద్యార్థులకు, తల్లిదండ్రులకు సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని సివోఈ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ కొరకు వెలువడిన ప్రకటన మంగళవారంతో ముగియనుండగా విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ధరఖాస్తు గడువును 04 ఫిబ్రవరి వరకు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి పొడగించడం జరిగిందని నిజామాబాద్ జిల్లా గురుకుల సమన్వయకర్త, ధర్మారం బీ గురుకుల సివోఈ కళాశాల ప్రిన్సిపల్ బి. సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని, గడువు లోగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి ధరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక కలర్ ఫోటో, అభ్యర్థి సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని, విద్యార్థి పూర్తి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు సరిగా ఉండేట్లు చూసుకోవాలని, ధరఖాస్తు చేయడానికి 100 రూపాయలు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబందించి బాలికలకు నిజామాబాద్ జిల్లాలో గల ధర్మారం బీ కళాశాల, బాలురకు బిక్కనూరు కళాశాల లతో పాటు విద్యార్థులు తెలంగాణా లోని అన్నీ సీవోఈ లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ సివోఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తో పాటుగా ఐఐటి, నీట్, ఎంసెట్ కి ప్రత్యేక తరగతులు ఉంటాయని వివరించారు. పూర్తి వివరాలకు సొసైటి వెబ్సైట్ యొక్క ్రషతీవఱర.aష.ఱఅ నందు గల ప్రాస్పెక్టస్ చదవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాడానికి సందర్శించాల్సిన సొసైటి వెబ్సైట్ ్రషతీవఱర.aష.ఱఅ.ను సందర్శించాలని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 07:51PM