నవతెలంగాణ డిచ్ పల్లి
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలకు మహేశ్ కుమార్.2022-23 జాతీయ స్థాయి పోటీలు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లోని సచివాలయ జింఖానా సెక్టార్ -21 లో 31జనవరి నుండి ఫిబ్రవరి 6 వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి జిల్లా పరిషత్ ఉచ్చతర పాఠశాల రాజారాం నగర్ , డిచ్ పల్లి మండలం నుండి టి.మహేష్ కుమార్ S.A (గణితం) పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా నిజామాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు ,పాఠశాల యామాన్య బృందం,7 వ బెటాలియన్ సిబ్బంది,మిత్ర బృందం అభినందించి హర్షం వ్యక్తంచేశారు.