నవతెలంగాణ - అశ్వారావుపేట
మండల వ్యాప్తంగా ఉన్న మూడు కంటి వెలుగు పరీక్షా కేంద్రాల పరిధిలో ,మంగళవారం మొత్తం 353 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు అశ్వారావుపేట(వినాయక పురం),గుమ్మడవల్లి పి.హెచ్.సి వైద్యాధికారులు డాక్టర్ రాందాస్,డాక్టర్ మధుళిక లు తెలిపారు.ఇందులో 111 మందికి కళ్ళద్దాలు పంపిణీ చేసి దూరదృష్టి ఉన్న 45 మందికి కళ్ళద్దాలు కు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
పరీక్షా కేంద్రాలు వారీగా....
కేంద్రం మొత్తం కళ్ళద్దాలు నమోదు
అశ్వారావుపేట 122 66 36
పేరాయిగూడెం 108 18 04
గుమ్మడవల్లి 123 27 05
మొత్తం 353 111 45
ఈ కేంద్రాలకు పర్యవేక్షకులు గా డాక్టర్ దీపిక,డాక్టర్ నీలిమ రెడ్డి,డాక్టర్ వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm